ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి అనే కారణంతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా, అమెరికా టెక్ దిగ్గజం సిస్కో కూడా ఈ జాబితాలో చేరనుంది. 4 వేలమంది ఉద్యోగులను తొలగించేందుకు సిస్కో సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని సిస్కో తొలగించనుంది. గత నెలలోనే సిస్కో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.