వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరో పదవి లభించింది. పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యుడిగా విజయసాయి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించనుంది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ, తనను పీఏసీ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషిలకు ధన్యవాదాలు తెలిపారు.