ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 12:02 PM

అవనిగడ్డ -2 సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ప్రతి షాప్ కి తిరిగి ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను నిత్యం ప్రజల మధ్యనే ఉండమంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. మంచి జరిగితేనే ఆదరించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని ఇలా దమ్ముగా చెప్పిన సీఎం గతంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com