ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో బుధవారం రోజు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళనున్నారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.