ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిని డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోట్ చేస్తూ జీవో 747 జారీ చేసింది. నూతనంగా 24 రెవిన్యూ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. 198 మందితో ఉన్న అడహాక్ ప్యానల్ నుండి 66 మందిని ప్రమోషన్లకు ఎంపిక చేసింది. కాగా, ఈ పదోన్నతలు తాత్కాలికమేనని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.