ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 12:21 PM

తన కేబినెట్ లోని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ అవినీతికి దూరంగా ఉండాలని, అవినీతి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్ హెచ్చరించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున మీడియా తమపై దృష్టి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వస్తే ప్రభుత్వంపై చెడు ప్రభావం పడుతుందని వెల్లడించారు. ప్రభుత్వం డబ్బును నేరుగా బటన్ నొక్కి వేస్తున్నందున అవినీతి జరుగుతున్నట్లు విమర్శలు రావడం లేదని సీఎం అన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com