మైదాన ప్రాంతంలో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. మన్యం వాతావరణం నెలకొంటుంది. బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. జాతీయ రహదారిలో వాహనాలు రాకపోకలకు కాస్తంత అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక పోవడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాయి. పొగ మంచు చుపరలను ఆకట్టుకుంది. మంచు సోయగాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోయారు అనేక మంది ఈ వాతావరణాన్ని ఆనందిస్తూ పొగ మంచు సోయగాలను తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు.