భర్తను కాదని ప్రియుడితో వెళ్లిపోయిన యువతి చివరికి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కర్ణాటక లోని హాసన్ జిల్లా పరసనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన కావ్యకు హాసన్ కు చెందిన యువకుడితో పెళ్లైంది. అయితే నాకు భర్త వద్దు, ప్రియుడు అవినాష్ కావాలంటూ అతనితో వెళ్లిపోయింది. కానీ అవినాష్ ఏ పని చేసేవాడు కాదు. అప్పట్నుండి పుట్టింటి వారితో కూడా సరిగా మాట్లాడేది కాదు. నెల క్రితం తల్లితండ్రులు ఫోన్ చేయగా బెంగళూరులో పని చేస్తూ హాస్టల్లో ఉంటున్నట్లు అబద్ధం చెప్పింది. మంగళవారం ఆమె ప్రియుడు హొళెనరసాపుర తహసీల్దాద్, పోలీసులకను కలిసి కావ్య చెరుకుతోటలో చనిపోయి ఉందని చెప్పాడు. వారు అక్కడికి వెళ్లి చూడగా, సగం పూడ్చిన కావ్యం మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.