2014 నుండి ఇప్పటివరకు ఏపీకి చేసిన సాయంపై కేంద్రం ప్రకటన చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏపీకి 2014 నుండి ఇప్పటి వరకు రూ.23,110 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,226 కోట్లు, రీసోర్స్ గ్యాప్ కింద రూ.5,617 కోట్లు, నూతన రాజధాని ఏర్పాటుకు రూ.2500 కోట్లు, వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి కోసం రూ.1,750 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.