తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఇక ఆయనకు క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉదయనిధి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే.