టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఏపీకి చెందిన ప్రముఖులతో కేసీఆర్ సంప్రదింపులు సైతం జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.