ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిగా ఉదయనిధి ప్రమాణస్వీకారం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 03:15 PM

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆయన కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ RN రవి ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌, ఇతర కేబినెట్‌ మంత్రులు హాజరయ్యారు. ఇక ఆయనకు క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉదయనిధి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com