పశ్చిమబెంగాల్ లో సీబీఐ కస్టడీలో ఉన్న ఓ అల్లర్ల కేసు నిందితుడు ఆ సంస్థ కార్యాలయంలోనే మరణించడం వివాదాస్పదమైంది. ఈ ఏడాది మార్చిలో బోగతుయీ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా ఉన్న లలన్ షేక్ గత సోమవారం.. బీర్భుం జిల్లా రాంపుర్ హట్ ప్రాంతంలోని సీబీఐ గెస్ట్ హౌస్ లోని టాయిలెట్ లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. లలన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో సీబీఐ డీఐజీ, సీబీఐ ఎస్పీ సహా ఏడుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై సీబీఐ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సమాచారం.