ఒడిశా భువనేశ్వర్ మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 11న జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ అనే యువకుడు బర్త్ డే వేడుకల సందర్భంగా పెద్ద శబ్దాలు చేస్తూ కేకలు వేయగా.. పక్కనే నివసిస్తున్న ఓ మహిళ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆగ్రహించిన వారు ఆ మహిళను ఓ ఇంట్లోకి లాక్కెళ్లి వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయగా ఇరుగు పొరుగు వచ్చి రక్షించారు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేశారు.