ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.4 కోట్ల బీమా కోసం స్నేహితుడి హత్య

Crime |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 11:28 AM

రూ.4 కోట్ల బీమా సొమ్ము కోసం కొందరు వ్యక్తులు స్నేహితుడినే హత్య చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అర్జున్ రమేశ్ భలేరావ్ (46) అనే వ్యక్తి నాసిక్ లోని డియోలలీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని పేరున రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీని అతని మిత్రులు కాజేయాలని ప్లాన్ చేశారు. మూడేళ్ల తర్వాత రమేశ్ నాసిక్ రాగా.. నలుగురు స్నేహితులు మరో మహిళతో కలిసి అతన్ని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే బీమా డబ్బులు పంచుకునే విషయంలో నిందితుల మధ్య వివాదం జరగ్గా.. వారిలో ఒకరు మృతుడి సోదరికి విషయం చెప్పాడు. డిసెంబర్ 12న హత్య చేసినట్లు తెలపగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com