ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లో గురువారం మాండూస్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన పంట పొలాలను జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ. తుఫాన్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న పంట పొలాల రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాండుస్ తుఫాను రైతులకు అపార నష్టం కలిగించిందని జనసేన నాయకులు అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.