ప్రముఖ ఆలయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది. నేటి ఉదయం నుండి భవానీ దీక్షల విరమణలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు భవానీ దీక్షల విరమణలు చేయనుండగా, సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు. గణపతి ఆలయం నుండి అమ్మవారి సన్నిధి వరకు 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదర్శనకు సైతం అనుమతి ఇచ్చారు. 20 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసి ఉంచారు.