మధుమేహంతో బాధ పడే వారికి ఇది నిజంగా మంచి విషయమే. టైప్-1 డయాబెటిస్ తో బాధ పడుతున్న వారు ఇకపై రోజూ ఇంజెక్షన్లు పొడుచుకునే బాధ తప్పనుంది. అతి త్వరలోనే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన విజయవంతమైంది. రక్తంలో చక్కెర స్థాయిలను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యూల్ ను మెల్ బోర్న్ లోని వాల్టర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు కనుగొన్నారు.