ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి పలు దేశాలు మద్దతిచ్చాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాకు యూకే, ఫ్రాన్స్, యూఏఈ మద్దతు పలికాయి. భారత్ తో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాల సభ్యత్వానికి సైతం అనుకూల ప్రకటన చేశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలుగా ఉన్నాయి.