సాధారణంగా మన ఇల్లు ఏదో ఒక గ్రామం లేదా పట్టణ పరిధిలోకి వస్తుంది. కానీ, ఒకే ఇల్లు రెండు రాష్ట్రాల పరిధిలోకి రావడం మీరెప్పుడైనా చూసారా? మహారాష్ట్ర చంద్రాపూర్ పరిధిలోని మహారాజ్ గూడ లోని ఒక ఇల్లు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ఇంట్లో మొత్తం 8 గదులు ఉండగా 4 గదులు తెలంగాణలో, మరో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ ఇంటి యజమాని ఉత్తమ్ పవార్ మాట్లాడుతూ " ఈ ఇంట్లో మేం 12- 13 మంది నివసిస్తున్నాం. నా సోదరుడి 4 గదులు తెలంగాణలో ఉండగా, నా 4 గదులు మహారాష్ట్రలో ఉన్నాయి. నా వంటగది తెలంగాణలో ఉంది" అని తెలిపారు.