రణస్థలం మండలంలోని జె. ఆర్. పురం పోలీస్లు, ఎంవిఐ అధికారులతో కలిసి శ్రీకాకుళం డిఎస్పీ ఎం. మహేంద్ర గురువారం పైడిభీమవరం వద్ద గల జాతీయ రహదారిని పరిశీలించారు. అందులో భాగంగా. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించి, తక్షణమే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ జె ఆర్ పురం పోలీస్ లకు సూచించారు.