ఒడిశా రాయగడ జిల్లా కాశీపూర్ సమితి డొంగశిలి పంచాయతీలోని గుంజరం పంజరి గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ డ్రైవర్. 120 కుటుంబాలు నివసించే గ్రామం బిచులి నదికి ఆవల ఉంది. ఈ క్రమంలో అత్యవసర సమయాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని అధికారులకు వివరించినా ఫలితం లేకపోయింది. దీంతో రంజిత్ తన భార్య నగలు తాకట్టు పెట్టి ఊరి కోసం రూ.70 వేలతో వంతెన నిర్మాణం చేపట్టాడు. అంతేకాకుండా 4 నెలలు శ్రమించి 4 కి.మీ మేర మట్టిరోడ్డు వేశారు. దీనికి రంజిత్ తండ్రి సైతం సహాయం చేశారు. దీంతో గ్రామస్థులు వీరి ఉపకారాన్ని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa