కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో దౌసాలో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. గురువారం దౌసాలో రైతులతో రాహుల్ సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో విద్యుత్, నీరు, ఎరువుల లభ్యతపై ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.