విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆశ్రమ సంఘాలు సీఎం జగన్ను ఆహ్వానించాయి. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈరోజు తాడేపల్లికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శాలువాతో సత్కరించారు. సీఎంకు వేద అనువాదాన్ని అందించారు.కాగా, శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం జనవరి 27 నుంచి 31 వరకు జరగనుంది.