ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోద్రా ఘటన.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 11:31 AM

గుజరాత్ లోని గోద్రా రైలు దహనకాండకు సంబంధించిన కేసులు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషికి సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆ వ్యక్తి 17 ఏళ్లు జైల్లోనే ఉన్న కారణంగా బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో మరికొందరు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com