చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకమైన అమలు చేశారా..? రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బాబు అమలు చేయలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ మండిపడ్డారు. మహిళా సాధికారత సీఎం వైయస్ జగన్ పాలనలో సాధ్యమవుతోందని, మహిళలు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్నది మా నినాదం, మా ప్రభుత్వ విధానమని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉషాశ్రీచరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.