ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 11:37 AM

రాష్ట్రంలోవైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు.వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com