ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలో ఉన్న సుఖోయ్-30 యుద్ధ విమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాల ప్రారంభం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది.