చేతబడి చేశారనే నెపంతో ఇద్దరు కోడళ్లను మామ కిరాతకంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా నన్నూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్ద గోవర్థన్ పెద్ద కొడుకు పెద్ద రామ గోవిందుకు రామేశ్వరమ్మ, చిన్న కొడుకు చిన్న రామగోవిందుకు రేణుకతో వివాహమైంది. ఇటీవల పెద్ద గోవర్థన్ కు ఆరోగ్యం బాలేక ఓ నాటు వైద్యుడికి చూపించుకోగా, అతను పసరు మందు తాగించాడు. ఆ సమయంలో పసరు పడగా, పసరు మీ కోడళ్లే పెట్టారని, చేతబడి చేశారని చెప్పాడు. ఈ విషయాన్ని కుమారులకు చెప్పి వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం పొలంలో పనులు చేసేందుకు వెళ్లిన తోటికోడళ్లను గడ్డి కోసుకురమ్మని పంపారు. ఇద్దరు కొడుకులతో అక్కడికి వెళ్లిన గోవర్ధన్ వేప కర్రతో రామేశ్వరమ్మ తలపై కొట్టగా ఆమె మృతిచెందింది. చిన్న కోడలు ఛాతీపై బలంగా మోదగా ఆమె సైతం మరణించింది. పోలీసులకు గోవర్థన్ పై అనుమానం వచ్చి విచారింగచగా విషయం బయటపడింది.