అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న ఆలయం చుట్టుపక్కల 500 మీటర్ల లోపు ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇతర వేడుకలు, వ్యవహారాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. అయోధ్య బృహత్ ప్రణాళిక-2031కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు. ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని నిర్ధేశిత 500 మీటర్ల పరిధిలోని నివాల గృహాలు, వ్యాపార సముదాయాల ఎత్తును 7.5 మీటర్లకే పరిమితం చేయాలని నిర్ణయించామన్నారు. సరయు నది, చెరువులు, కాలువలు నీటి వనరుల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.