గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలి మహిళ మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వారణాసిలోని జంగంబడి ప్రాంతంలో గురువారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆ ఇంట్లోని నాలుగు గదుల్లో రెండు కూలిపోయాయి. ఇంట్లో ఉన్న నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో బేబి వర్మ అనే మహిళ మృతి చెందింది. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజలింగం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa