ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 కాళ్లతో జన్మించిన శిశువు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 02:19 PM

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని కమల్ రాజా విమెన్స్ అండ్ చైల్డ్ పీడియాట్రిక్స్ డిపార్ట్ మెంట్ లో ఓ శిశువు 4 కాళ్లతో జన్మించింది. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయ్యింది. సికందర్ కాపు ప్రాంతానికి చెందిన ఆర్తి కుశ్వాహా అనే మహిళకు.. ఆడ శిశువు జన్మించినట్లు వైద్యులు చెప్పారు. 2.3 కిలోల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని అన్నారు. శిశువుకు నడుము కింద బాగంలో అదనంగా మరో 2 కాళ్లు పుట్టుకొచ్చాయని దీన్ని మెడికల్ సైన్స్ లో ఇస్కియోపాగస్ అంటారని తెలిపారు. పిల్లల వైద్య నిపుణులు శిశువుని పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కాళ్లను తొలిగిస్తారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com