భారత్ లో ట్విట్టర్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మొత్తం 250 మంది ఉద్యోగులకు 170 మందికి ఉద్వాసన పలికింది. దీంతో ఢిల్లీ, ముంబై, కార్యాలయాల పరిధిలో ట్విట్టర్ కు కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 250 మంది చేసిన పనిని.. ఇక మీదట కేవలం 80 మంది ఉద్యోగులే నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఇది నయా శ్రమ దోపిడీకి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి.