హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్యపై రాజస్థాన్ లో గృహహింస కేసు నమోదైంది. విక్రమాదిత్య భార్య సుదర్శనా సింగ్ చూడావత్ అత్తింటివారు తనను వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్రమాదిత్య, సుదర్శనకు 2019 మార్చిలో పెళ్లైంది. పెళ్లి అయిన కొన్నాళ్లకే తనపై గృహహింసకు పాల్పడ్డారని, మానసికంగా, శారీరకంగా వేధించారని తెలిపారు. తమ మామ వీరభద్రసింగ్ మరణించాక, తనను పుట్టింటికి పంపేసారని ఆమె తెలిపారు. తన భర్తకు చండీగఢ్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, తనకు విక్రమాదిత్య నుండి భరణం ఇప్పించాలని కేసు దాఖలు చేశారు. దీంతో ఉదయ్ పూర్ పోలీసులు ప్రతిభాసింగ్, ఆమె కుమారుడికి సమన్లు జారీ చేశారు.