స్విగ్గీ ఆర్డర్లలో మళ్లీ బిర్యానీయే నెంబర్ 1గా నిలిచింది. ఏటా ఎక్కువ ఏ ఆర్డర్లు ఏ డిషెష్ కోసం వచ్చాయన్న వివరాలను స్విగ్గీ విడుదల చేస్తుంటుంది. 2022లో ప్రతి సెకన్ కు 137 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ డెలివరీ చేయగా.. బిర్యానీ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం ఇది ఏడోసారి. ఆ తర్వాత మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, తందూరీ చికెన్ కోసం ఎక్కువ మంది ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొంది. కొత్త రుచుల విషయంలో భారతీయులు ప్రయోగ ధోరణి ప్రదర్శించారని.. పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, సుషీ కోసం ఆర్డర్లు ఎక్కువ వచ్చాయంది.