బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పంత్ ఆటపై ప్రశంసలు కురిపిస్తూ పలు సూచనలు చేశారు. పంత్ అధిక బరువుతో ఉన్నాడని, ఫిట్ గా ఉంటే ఇంకా మంచి షాట్లను ఆడగలడని తెలిపాడు. తొలి టెస్టులో పంత్ ఎలా ఆడాలి అనుకున్నాడో అలా ఆడేశాడని, చెత్త షాట్లను ప్రయోగించేందుకు ప్రయత్నించాడని అన్నారు. దురదృష్టవశాత్తూ బౌల్డయ్యాడని అన్నాడు. పంత్ కాస్త అధిక బరువుతో ఉన్నాడని, తప్పకుండా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భట్ వెల్లడించాడు.