ఎలుకలను ఆహారంగా తీసుకోవడం అనేది భారత్ లోని బీహార్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదు. కంబోడియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఘనా, చైనా, వియత్నాం వంటి దేశాల్లో ఎలుక మాంసం ఇష్టంగా తింటారు. ఏటా మార్చి 7న ఈశాన్య భారతదేశంలోని ఓ గ్రామంలో గిరిజనులు ‘యూనంగ్ ఆరాన్’ అనే ఉత్సవం నిర్వహిస్తారట. ఈ వేడుకలో అతిథులకు ఆహారంగా ఎలుకలు వండిపెడతారు. అంతే కాకుండా పెళ్లిళ్లలో కట్నంగా ఎలుకలను ఇస్తారట. ఫిన్లాండ్ ఓలో యూనివర్శిటీకి చెందిన విక్టర్ బెన్నో మేయర్ తన పరిశోధనలో గిరిజనుల ఆహారంపై ఈ వివరాలు వెల్లడించారు.