చత్తీస్ గఢ్ లో ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య కలకలం రేపాయి. రాయ్ పూర్ లో డిసెంబర్ 7న ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 5 రోజుల తర్వాత ఆమె నివాసం ఉండే కాలనీ పక్కనే బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కేసు లోతుగా విచారించిన పోలీసులు చిన్నారి ఉండే బిల్డింగ్ లోని 14 ఏళ్ల బాలుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి.