బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లెపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం మండల అధ్యక్షులు చిలేఖాంపల్లి వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ లతోపాటు విద్యార్థి నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పాఠశాల లో విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులతో విచారించి అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనిపై గతంలో డీఈవో, డిప్యూటీ డిఇఓ ల దృష్టికి తీసుకెళ్లిన స్పందించిన దాఖలాలు లేవని విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో తన ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో డిప్యూటీవో సంఘటన స్థలం చేరుకుని విద్యార్థులతో ఉపాధ్యాయులతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిపై సరైన స్పందన లేకపోవడంతో గంటసేపు పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడం జరిగింది. రోడ్డుపై బైఠాయించిడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.