ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధికార బీజేపీ ఫైర్ అయింది. భుట్టో వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భుట్టో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో పాకిస్థాన్, పాక్ మంత్రి భుట్టో దిష్టిబొమ్మల్ని శనివారం తగలబెట్టనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.