వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు అమెరికా తాజా జట్టును ప్రకటించింది. దాదాపు అందరూ భారతీయ సంతతికి చెందినవారే. తెలుగువారి ఉనికి ఒకటైతే... ఆ జట్టుకు సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన గీతిక కోడలి కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం గమనార్హం. 11 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న గీతిక.. 14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న గీతిక.. 17 ఏళ్ల నుంచి అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.