పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ మాజీ చైర్మన్ తురక కిషోర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇడ్బెం ఖర్మ మన రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు తలపడడంతో ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేయగా, పోలీసులు రంగప్రవేశం చేసి జూలకంటి బ్రహ్మారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. బ్రహ్మారెడ్డిని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ కార్యాలయానికి కొందరు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. మాచర్ల టీడీపీ నేత దుర్గారావు కారును కూడా దగ్ధం చేశారు.ఈ దాడుల్లో పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.