భారత ప్రధానినరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. నిన్న కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బిలావర్ భుట్టో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.