మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. ఉపాధ్యాయుల బదిలీల అంశంపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బదిలీవ విషయంలో ఉపాధ్యాయులు నాలుగైదు సవరణలు కోరారని, సవరణలు చేస్తామని తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే బదిలీలపై సవరణలతో కూడిన ప్రకటన చేస్తామని మంత్రి వెల్లడించారు. వెయ్యి స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈనెల 21న 5.6 లక్షల మంది విద్యార్ధులకు, 59 వేల మంది టీచర్లకు 686 కోట్ల తో సీఎం చేతుల మీదుగ ట్యాబ్ ల పంపిణీ చేస్తామన్నారు.