ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ పార్ట్-1 ఏరియాలోని ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్లో ఇవాళ ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నామన్నారు.