రైలు ప్రయాణం మహా అయితే వేలల్లో ఉంటుంది. అయితే ఓ రైలు టిక్కెట్ మాత్రం ఏకంగా లక్షల్లో ఉంది. ఐఆర్ సీటీసీ ద్వారా నిర్వహించబడుతున్న ‘మహారాజాస్ ఎక్స్ ప్రెస్’లో ప్రయాణించాలంటే ఏకంగా రూ.19 లక్షలకు పైగా ఖర్చవుతుందట. అందుకు తగ్గట్టుగానే ఈ రైలులో వసతులు కూడా ఉంటాయి. ఓ కోచ్ మొత్తం అందంగా ఓ ఇల్లులా తీర్చిదిద్దారు. 2 బెడ్ రూంలు, లివింగ్ ఏరియా, వాష్ రూమ్స్, టీవీ తదితర వసతులు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ ట్రైన్ విశేషాలు మీరు చూసేయండి.