హర్యానాకి చెందిన శివంభట్.. చండీగఢ్ నుంచి షాజహాన్ పూర్ కు లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. రైలులో వాటర్ బాటిల్ కొనుగోలు చేయగా ఎమ్మార్పీ రూ.15 ఉంటే అమ్మకందారుడు రూ.20 వసూలు చేశాడు. దీన్ని వీడియో తీసి రైల్వే అధికారులకు శివం ట్యాగ్ చేశాడు. దీంతో పోలీసులు అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ రవికుమార్ ను సైతం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కాంట్రాక్టరుకు రూ.లక్ష జరిమానా విధించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ భాటియా తెలిపారు.