ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యా విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుండి 1-9 తరగతుల వారికి రెండు సెమిస్టర్లు ఉండనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుండి పదో తరగతిలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాగా, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు చెందిన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.