రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో జరిగిన సిలిండర్ పేలుడులో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. డిసెంబరు 16న జరిగిన ఈ ప్రమాదంలో 60 మందికి పైగా కాలిపోగా, ఇప్పటివరకు 32 మంది మరణించారు. వారం క్రితం వివాహ వేడుకలో జరిగిన పేలుడులో వరుడి సోదరి సహా ఐదుగురు మహిళలు కూడా గత 12 గంటల్లో మరణించారు. ప్రమాదంలో బాధిత కుటుంబాలు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరించాయి. గురువారం సాయంత్రం జోధ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ ఆసుపత్రి వెలుపల సొసైటీ సభ్యులు, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పరిహారం ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.