మనం తినే చిరుతిళ్లకు పండ్లు పాడై పోవడమో లేక పండ్లకు సంబంధించిన వ్యాధులు రావడమో సర్వ సాధారణంగా మారింది. చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. పలు చిట్కాలు పాటించడం ద్వారా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి, లవంగం ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే కొద్ది సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది. లేదా పంటి నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఒక నాలుగు, ఐదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది. అంతే కాకుండా మూడు నాలుగు చుక్కల విస్కీని కాటన్ లో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే నొప్పి మాయం అవుతుంది.